వన్యప్రాణులను సంరక్షించాలి

Sun,October 6, 2019 12:01 AM

దహెగాం: వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత అందరిదని జిల్లా అటవీశాఖ అధికారి లక్ష్మణ్ రంజిత్ కుమార్‌నాయక్ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా శనివారం గిరివెల్లిలో వన్యప్రాణులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వన్యప్రాణులను వేటాడితే చట్టప్రకారం చర్య లు తీసుకుంటామన్నారు. గిరివెల్లిలో అటవీ ప్రాం తం విస్తారంగా ఉండడంతో వన్యప్రాణులు అబివృద్ధి చెందుతున్నాయన్నారు. అంతేగాకుండా పె ద్దపులులు ఆవాసంగా చేసుకొని సంచరిస్తున్నాయన్నారు. వన్యప్రాణుల వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం అందిస్తామన్నారు. అనంతరం ఏఎస్పీ సు ధీంద్ర మాట్లాడుతూ వనాల తోనే మానవ మనుగడ ఉంటుందనీ, అడవులు, వన్యప్రాణులను సం రక్షించాలని సూచించారు. వారోత్సవాల్లో భాగం గా వైద్యశిబిరం ఏర్పాటు చేసి 150 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వైస్ ఎంపీపీ చౌదరి సురేశ్, సర్పంచులు కారు రాజన్న, ఎల్కరి సంజీ వ్, సందికట్ల రమేశ్, ఎఫ్‌ఆర్వో పూర్ణిమ, వైద్యులు సతీశ్, ఆర్‌డబ్ల్యూ జేఈ వినోద్, హెచ్‌వీ సోఫియామేరి, ఏఎన్‌ఎంలు హేమలత, సంతోషమ్మ, సత్యవాణి, కార్యదర్శి రవికాంత్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles