వానలే వానలు

Sat,October 5, 2019 01:39 AM

-జిల్లా వ్యాప్తంగా భారీగా కురిసిన వానలు
-ఇప్పటి వరకు కురవాల్సిన వర్షపాతం 1034 మిల్లీ మీటర్లు
-కురిసింది 1238.2 మిల్లీ మీటర్లు..
-సాధారణం కంటే 20 శాతం అధికం
-ప్రాజెక్టులు, చెరువులు, కుంటలకు జలకళ
-పెరిగిన సాగు.. ఆనందంలో అన్నదాతలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా జూన్ నుంచి నేటి వరకు సాధారణ వర్షపాతం 1034 మిల్లీ మీటర్లు నమోదు కాగా, ఇప్పటి వరకు1238.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కురవాల్సిన దాని కంటే 20 శాతం అధికంగా నమోదైంది.

జిల్లా వ్యాప్తంగా1238.2. మిల్లీ మీటర్ల వర్షపాతం
జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి 1238.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ నుంచి నేటి వరకు సాధారణ వర్షపాతం 1034 మిల్లీ మీటర్లు కాగా ఇప్పటి వరకు 1238.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కురవాల్సిన వర్షపాతం కంటే ఎక్కువగా నమోదైంది. జిల్లాలోని బెజ్జూర్ మండలంలో 1109.5 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 1759.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అతి తక్కువగా రెబ్బన మండలంలో 985.9 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా 933.7 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ మండలంలో సాధారణం కంటే 5 శాతం తక్కువగా నమోదైంది. ఇప్పటి వరకు ఐదు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.

ప్రాజెక్టులు, చెరువుల్లో పూర్తిస్థాయి నీటి మట్టం
అధిక వర్షాలతో జిల్లాలో ప్రాజెక్టులు, చెరువుల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువాలో ఉంది. చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. కుమ్రం భీం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.132 టీఎంసీలు కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 320 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా స్పిల్‌వేల ద్వారా 280 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వట్టివాగు ప్రాజెక్టు సామర్థ్యం 2.890టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.700 టీఎంసీలు కొనసాగుతుంది. ఇన్‌ఫ్లో 800 క్యూసెక్కులు వస్తుండగా రెండు గేట్లను తెరిచి 30 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. కెనాల్స్ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని పంటలకు వదులుతున్నారు.

ఆనందంలో అన్నదాతలు
జిల్లాలో సాగవుతున్న పంటలకు అనుకూలంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పను ల్లో బిజీగా గడుపుతున్నారు. ఎక్కువగా కొండలు, గుట్టలే కావడంతో కురిసిన వర్షపు నీరు వాగులు, వంకల ద్వారా కుంటలు, చెరువుల్లోకి చేరుతుంది. దీంతో నీటి వనరుల్లోకి కొత్త నీరు చేరుతోంది. కాగా రైతులు చేనుల్లో కలుపు, దరవరలు వంటి పనులు చేసుకునేందుకు కూడా వర్షాల కారణంగా వీలుకలుగడం లేదు. జిల్లాలో పంటలకు అనుకూలంగా వర్షా లు కురుస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చే స్తున్నారు. కుమ్రం, వట్టి ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటి మట్టానికి చేరువాలో ఉండడంతో వరిసాగుపై రైతు లు ధీమాగా ఉన్నారు. జిల్లాలో గత ఏడాది సుమారు 1 లక్ష 30 వేల ఎకరాలు సాగు కాగా ఈ ఏడాది 1,36,448 హెక్టార్లలో సాగు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిలో అత్యధికంగా పత్తి 87,118 హెక్టార్లలో సాగవుతుం డగా వరి 12,940, జొన్న 1631, కంది 17902, పెసర 2512, సోయబీన్ 6207 హెక్టార్లలో సాగువుతుంది.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles