రైతుల సమస్యలు పరిష్కరిస్తా

Sat,October 5, 2019 01:37 AM

రెబ్బెన: మండలంలోని రైతుల సమస్యల పరిష్కరం కోసం తనవంతుగా కృషి చేస్తానని తాసిల్దార్ సయ్యద్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం రైతులకు కొత్త పట్టాపాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో ఇప్పటి వరకు చాలా మంది రైతులకు పట్టాపాస్ పుస్తకాలు అందించామన్నారు. పొరపాట్లు జరిగిన వాటి స్థానంలో కొత్తవి పంపిణీ చేశామన్నారు. రైతులకు ఏమైన భూ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. కార్యక్రమంలో డి ప్యూటీ తాసిల్దార్ పిట్టల సరిత, సిబ్బంది పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles