భీం వర్ధంతిని విజయవంతం చేయాలి

Sat,October 5, 2019 01:37 AM

జైనూర్: ఈ నెల 13న జోడేఘాట్‌లో నిర్వహిస్తున్న కుమ్రంభీం వర్ధంతిని విజయవంతం చేయాలని కుమ్రంభీం మనువడు కుమ్ర సోనెరావ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ వివిధ సంఘాల నాయకులు మెస్రం మోతిరాం, దేవేందర్, గేడాం గోపిచంద్, లక్ష్మణ్, మోహన్, కనక గంగారాం, ఎంపీటీసీలు మహాదవ్, కుమ్ర భగవంత్‌రావ్ పాల్గొన్నారు. సిర్పూర్(యు)/ వాంకిడి: ఆదివాసీల అభ్యున్నతి కోసం పోరాటం చేసి వీర మరణం పొందిన కుమ్రం భీం వర్ధంతి ఈ నెల 13న కెరమెరి మండలం జోడేఘాట్‌లో నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీపీ ఆత్రం భగవంత్‌రావ్, సావాతి సర్పంచ్ దేవ్‌రావు అన్నారు. శుక్రవారం సిర్పూర్(యు), వాంకిడిలో వర్ధంతికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సభకు ఆదివాసీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు సోయం ముకుం ద్, భీంరావ్, భూపతి, కబీర్‌దాస్, చంపత్, ఎంపీటీసీలు, సర్పంచులు, గిరిజన నాయకులు జంగు, సయ్యా ద్ ఆయ్యూబ్, భీంరావు, కోడప మారుతి, వాసుదేవ్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles