హెల్ప్‌లైన్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Thu,September 19, 2019 12:51 AM

బెజ్జూర్ : తాసిల్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో శివకుమార్ అన్నారు. బుధవారం తాసిల్ కార్యాలయంలో బీఎల్‌వోలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నిచోట్ల కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు చోట్ల ఉన్నాయనీ, వీరి పేర్లన్నీ ఒకే జాబితాలో ఉంచేలా సవరిస్తామన్నారు. ఇందుకోసం హెల్ప్‌లైన్‌లో సంప్రదించాలని సూచించారు. జనవరి 2020 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకుల పేర్లు కూడా నమోదు చేసుకొని వా రిని ఓటరు జాబితాలో పొందుపరచనున్నట్లు పేర్కొన్నారు. దీ నిపై జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి కృష్ణయ్య బీఎల్‌వోలకు అవగాహన కల్పించారు. అంతకు ముందు విరాసత్ పట్టాలు పెండింగ్ సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలి? ప్రతి వీఆర్వో తమ గ్రామాల్లో చేయాల్సిన విరాసత్ వివరాలు తెలుసుకు న్నా రు. పెండింగ్ విరాసత్ పట్టాలు 15 రోజుల్లో పూర్తి చేయాలని వీఆర్వోలను ఆదేశించారు. బెజ్జూర్ శివారులో సర్వే నెంబర్ 762 లో గతంలో అటవీ భూములు సంబంధం లేని వాటిని డి జిటల్ చేసి పట్టాలు ఇచ్చేలా రేంజ్ అధికారితో మా ట్లాడి పరిష్కరించాలనీ, అంతేగాకుండా పట్టాపాసు పుస్తకాలు అం దజే యాలని తాసిల్దార్ లక్ష్మణ్‌ను ఆదేశించారు. డీటీ రవీందర్, జూ నియర్ అసిస్టెంట్ రమేశ్ వీఆర్వోలు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

పెంచికల్‌పేట్ : ఓటరు సర్వే పగడ్బందీగా చేపట్టాలని ఆర్డీవో శివకుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తాసిల్ కార్యాలయంలో సీపీవో కృష్ణయ్య బీఎల్‌వోలకు ఓటరు జాబితాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎలక్ట్రరోల్ వెరిఫికేషన్ ప్రోగ్రాంలో భాగంగా బీఎల్‌వోలు ఇంటింటా తిరుగుతూ జాబితా ఆధారంగా వివరాలు సేకరించి ఓటరు వివరాలు తప్పులుంటే సరిచేయాలన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ ప్రకాశ్, ఆర్‌ఐలు సంతోష్, విజయలక్ష్మి, బీఎల్‌వోలు, రేషన్ డీలర్లు, మీసేవా సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles