రసాయన శాస్త్రమే కీలకం

Thu,September 19, 2019 12:50 AM

ఆసిఫాబాద్: మానవుడి జీవితంలో ర సాయన శాస్త్రం ఎంతో కీలకమని డీఈఓ భిక్షపతి అన్నారు. పట్టణంలోని అదర్శ పాఠశాలలో బుధవారం రసాయన మూలకాల వర్గీకరణ, అవర్తన పట్టిక, మాన వుడి జీవితం.. దాని ప్రభావం అనే అంశంపై విద్యార్థులకు సైన్స్ సె మినార్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మా నవుడి ఆయు ప్రమా ణం చాలా తక్కువగా ఉండేదన్నారు. రసా యన శాస్త్రం అభి వృద్ధి చెందడంతో, అయుష్షు ప్రమాణా లు పెరిగాయ న్నారు. విద్యార్థులకు రాత పరీక్షలు నిర్వహించి, విజేతలకు బహుమ తులు అందించారు. జిల్లా సైన్స్ అధికారి మధుకర్, సెక్టోరి య ల్ అధికారులు జబ్బార్, అనురాధ, పాఠ్య పుస్తకాల మే నేజర్ వెంకటెశ్వర్లు, ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖాలీద్, రాజేశం, ఉన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles