వెంటనే స్పందించాలి

Thu,September 19, 2019 12:50 AM

ఆసిఫాబాద్ టౌన్ : డయల్ -100 కాల్స్‌పై వెంటనే స్పందించాలని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి స మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. కాల్ రాగానే సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే సేవలు అందించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో వాహనాల తనిఖీలు చేస్తూ, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలన్నారు. కళాబృందాల కార్యక్రమం, కమ్యూనిటీ పోలీసింగ్, నేను సైతం, షీ టీం కార్యక్రమాల ద్వారా డయల్ 100, మహిళలపై జరిగే నేరాలు, మూఢనమ్మకాలు, ట్రాఫిక్ ని యమాలు, రోడ్డు భద్రత నియమాలు, చట్టాలు, ఆత్మహత్యలు, చెడు అలవాట్లపై అవగాహన కల్పించాలని సూచించారు. గత నెలలో నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ స్థితిగతులపై అడిగి తె లుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న యూఐ కేసు లు, పోలీస్ కస్టడీ, బెయిల్స్, వారెంట్లు అమలు, నేరస్తులను గుర్తించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రవేశపెట్టిన 17 వర్టికల్ గురించి ప్రతి పోలీసు అధికారికి తెలిసి ఉండాలనీ, వర్టికల్ పట్ల ఎస్‌హెచ్‌వో పర్యావేక్షిస్తూ పోలీస్‌స్టేషన్‌లో 5ఎస్ పద్ధతిని తప్పకుండా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉ త్తమ పోలీసులుగా ఎంపికైన వారికి ఎస్పీ రివార్డులను ప్రదానం చేసి అభినందించారు. సమావేశం లో జిల్లా అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, ఏఆర్ అదనపు ఎస్పీ సురేశ్, ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, ఐటీ కోర్ సీఐ సత్యనారాయణ, జి ల్లాలోని అన్ని స్టేషన్‌ల సీఐలు, ఎస్‌ఐలు, ఐటీసెల్ సిబ్బంది, డీసీఆర్‌బీ సిబ్బంది, ఎస్పీ సీసీ మనోజ్ పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles