ప్రభుత్వపాఠశాలల్లో వైద్య శిబిరం

Wed,September 18, 2019 02:31 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో రాష్ట్రీయ బా ల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా వైద్యులు న రేందర్‌రెడ్డి, అన్నపూర్ణ ఆధ్వర్యంలో మంగళవా రం వైద్య శిబిరం నిర్వహించారు. అవసరమున్న వారికి మా త్రలను పంపిణీ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా విద్యార్థులకు డెంగీ నివారణ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఖాళీల్, ఫార్మసిస్ట్ మంగళ్, ఏఎన్‌ఏఎం స్వర్ణలత పాల్గొన్నారు.
జైనూర్: విద్యార్థులు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప రిశుభ్రత పాటించాలని మండల వైద్యాధికారి నా గేంద్ర అన్నారు. మండలంలోని పోచ్చంలోద్ది కేజీబీవీ, జైనూర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మంగళవారం వైద్యశిబిరాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, వ్యక్తిగ త పరిశుభ్రత పాటించాలన్నారు. పాఠశాల ప్రత్యేకాధికారి రేణుక, హెచ్‌ఎస్ కిషోర్, లక్ష్మీకుమారి, హెచ్‌ఎస్ రమేశ్, వినోద్ తదితరులున్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles