విమర్శలను సహించం

Mon,September 16, 2019 12:36 AM

బెల్లంపల్లి, నమస్తే తెలంగాణ: నియోజకవర్గానికి కాకా కుటుంబం ఏమి చేశారో ఎమ్మెల్యే చిన్నయ్యను విమర్శించేవారు చెప్పాలని టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ,టీబీజీకేఎస్ ప్రతినిధి గెల్లిరాయలిం గు, మాజీ కౌన్సిలర్ ఎస్‌కే యూసుఫ్ సవాల్ విసిరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. ప్రజల ఓట్లతో కోటీశ్వైర్లెన కాక తనయులు వివేక్, వినోద్ నమ్మకద్రోహులని ద్వజమెత్తారు. తల్లిలాంటి పార్టీలో ఉంటూనే అన్న వినోద్‌ను బెల్లంపల్లిలో ఎన్నికల బరిలో దింపి టీఆర్‌ఎస్‌కు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. తల్లి పాలుతాగి రోమ్మును గుద్దిన వివేక్,వినోద్‌లకు బీజేపీ నాయకులు తొత్తులుగా మారి ఎమ్మెల్యే చిన్నయ్యపై అసత్యారోణపలు చేయడాన్ని బెల్లంపల్లి ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. బెల్లంపల్లి అభివృద్ధ్దికి నిత్యం పాటుపడుతున్న ఎమ్మెల్యే చిన్నయ్యను విమర్శిస్తే సహించమని హెచ్చరించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వివేక్ తాబేదారులు ఇకనైనా మౌనంగా ఉండాలనీ, చేసిన ఆరోపణలు దమ్ముం టే నిరూపించాలనీ సవాల్‌చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు ఏలూరి వెంకటేశ్, రమేశ్, జిలుకర వాసు, వేణు, మద్ది కిషోర్, రమేశ్, పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను విమర్శించే హక్కు లేదు
బెల్లంపల్లి టౌన్: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను విమర్శించే నైతిక హక్కు బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొ య్యల ఏమాజీకి లేదని మాజీ కౌన్సిలర్ బత్తుల సుదర్శన్ ఒక ప్రకటనలో విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వేల ఓట్లు కూడా దాటని ఏమాజీ చిన్నయ్యను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles