రాజీమార్గమే రాచమార్గం

Sun,September 15, 2019 12:52 AM

- పంతాలకు పోయి సమయం వృథా చేసుకోవద్దు
- లోక్ అదాలత్‌లో సిర్పూర్(టి) జడ్జి రామారావు
- 121 కేసుల పరిష్కారం
- కక్షిదారులకు భోజన ప్యాకెట్ల అందజేత

సిర్పూర్(టి): రాజీమార్గమే రాచమార్గమని సిర్పూర్(టి) జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బత్తుల రామారావు అన్నారు.శనివారం మండలకేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో జాతీయ లోక్ ఆదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు క్షణికావేశంలో పంతాలు, పట్టింపులకు పోయి విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారన్నారు. అనంతరం సిర్పూర్(టి) కోర్టు పరిధిలోని సిర్పూర్(టి), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జుర్, పెంచికలపేట్, దహెగాం, కాగజ్‌నగర్ మండలాల పరిధిలోని మొత్తం 121 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కౌటాల సర్కిల్ పరిధిలో మొత్తం 41 క్రిమినల్ కేసులు, సిర్పూర్(టి) మండలంలో 12కేసులను పరిష్కారమయ్యాయ ని సిర్పూర్(టి) ఎస్‌ఐ మధుకర్ తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు కిశోర్‌కుమార్, రయిస్ అహ్మద్, శంకర్‌రావు, కౌటాల, కాగజ్‌నగర్ టౌన్ ఇన్‌స్పెక్టర్లు మోహన్, కిరణ్‌కుమార్, సిర్పూర్(టి) ఎస్‌ఐ మధుకర్ , ట్రైనీ ఎస్‌ఐ సందీప్, ఇతర మండలాల ఎస్‌ఐలు, కక్షిదారులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనం..
మండలకేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన లోక్‌ఆదాలత్‌కు వచ్చిన కక్షిదారులకు శనివారం ఇచ్చామిటి ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో సిర్పూర్(టి) సివిల్ కోర్టు న్యాయమూర్తి రామారావు మధ్యాహ్న భోజన ప్యాకెట్లను అందజేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు గోవింద్‌మండల్, సెక్రటరీ ఇంద్రజీత్, సభ్యులు ఠాకుర్, ప్రదీప్, ఆశుతోష్, శివ, విజయ్ పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి..
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్‌లు ఎంతో ఉపయోగపడుతుందని మూడో ఆదనపు న్యాయమూర్తి నారాయణ బాబు అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ఆదాలత్ నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ శాఖ ఆధ్వర్యంలో ఇరు వర్గాలను రాజీకుదిర్చి పలు కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. మూడో న్యాయ మూర్తి నారాయణ బాబు, జూనియర్ సివిల్ జడ్జి సురేశ్ వారి పరిధిలోని 125 కేసులను పరిష్కరించారు. డీఎస్పీ సత్యనారాయణ ,బార్ ఆసోసియోషన్ ఆధ్యక్షుడు నికోడే రవీందర్, పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles