పాఠశాలలో శ్రమదానం

Sun,September 15, 2019 12:50 AM

రామకృష్ణాపూర్: మన బడి-మన గుడిలో భాగంగా క్యాతనపల్లి పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం పారిశుధ్య పనులు చేపట్టారు. పరిసరాలను శుభ్రం చేశారు. ప్రిన్సిపాల్ ప్రాన్సిష్ మాట్లాడుతూ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ప్రవీన్‌కుమార్ ఆదేశాలతో మందమర్రి (రామకృష్ణాపూర్) పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనిలో పేరెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక రామాలయం యూత్ అధ్వర్యంలో పాఠశాలకు 10 గోడ గడియారాలు అందజేశారు. యూత్ అద్యక్షుడు దండు సదానందం మాట్లాడుతూ విద్యార్థుల గదుల్లో గడియారాలుంటే వారికి సమయం తెలుస్తుందని అందజేసినట్లు చెప్పారు. యాత్ సభ్యులు దండు సదానందం, పొన్నాల సాగర్, పలిగిరి కనకరాజు, కంది మహేందర్, మిట్లపల్లి సంతోష్‌కుమార్, ఇనుగాల శి వకుమార్,పేరెంట్స్ కమిటీ సభ్యులు దండు శ్రీనివాస్, మర్రి సదానందం పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles