పురపోరుపై గులాబీ గురి

Sat,September 14, 2019 01:03 AM

- మున్సిపల్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ సమాయత్తం
- క్యాడర్‌ను సిద్ధం చేయాలని కేటీఆర్ పిలుపు
- మున్సిపాలిటీల వారీగా ఇన్‌చార్జిలు
- బూత్, వార్డు కమిటీల ఏర్పాటుపై కసరత్తు
- ఎన్నికలు ఎప్పుడొచ్చినా శ్రేణుల సన్నద్దం

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలుండగా.. మంచిర్యాల జి ల్లా లో ఏడు, నిర్మల్ జిల్లాలో మూడు, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒకటి చొప్పున మున్సిపాలిటీలున్నా యి. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, క్యాతన్‌పల్లి, నస్పూర్, లక్సెట్టిపేట, చెన్నూర్, మందమర్రి, బెల్లంపల్లి, నిర్మల్ జిల్లాలో ని ర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉండగా.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్‌నగర్ మున్సిపాలిటీలున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, నిర్మల్, భైంసా, ఆదిలాబాద్.. ఏడు మున్సిపాలిటీలు ఉండేవి. కొత్తగా ఐదు మున్సిపాలిటీలు ఖానాపూర్, చెన్నూర్, నస్పూర్, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేటను ఏ ర్పాటు చేశారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కొత్త మున్సిపాలిటీల ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇవి గతంలో మేజర్ గ్రామ పంచాయతీలుకా గా.. వీటిని మున్సిపాలిటీలు చేయాలనే ప్రతిపాదనలు ఉండడంతో.. ఇటీవల పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించలేదు. ఇవి రెండు కూడా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తే.. ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 14కు చేరనుంది. మంచిర్యాల మున్సిపల్‌ను కార్పొరేషన్‌గా చేయాలని భావిస్తుండగా.. మందమర్రి మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు.

ప్రత్యేకాధికారుల పాలనలో..
మున్సిపాలిటీలకు 2014 ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించగా.. జూన్‌లో ఫలితాలు వెల్లడించారు. జూలైలో పాలకవర్గాలు ప్ర మాణ స్వీకారం చేయగా.. 2019, జూలై 2న ఈ పాలకవర్గాలకు గడువు ముగిసింది. దీంతో అదే రోజు నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. మున్సిపాలిటీల పాలకవర్గాలకు గడువు ముగియటం తో.. జూలైలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిర్ణయించగా.. అవసరమైన ఏర్పాట్లు చేసింది. వా ర్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా తయారు చేసి.. తుది ఓటర్ల జాబితాను కూడా ప్రకటించారు. వార్డుల పునర్విభజనపై అ భ్యంతరాలున్నాయంటూ.. కొన్ని చోట్ల హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఇప్పటికే ఏడుసార్లు విచారణ చేపట్టగా.. వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ నెల 26 న విచారణ చేసి తీర్పు ఇవ్వనుంది. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ టీఆర్‌ఎస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు పూర్తి చేయగా.. గ్రామ, మండల, జిల్లా కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. చాలా మండలాల్లో గ్రామ, మండల కమిటీలు పూర్తవగా.. మిగతా చోట్ల చివరి దశలో ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో సభ్యత్వ నమోదు ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తంలో చేయగా.. కమిటీల కూర్పుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా శ్రేణుల సన్నద్ధం..
మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రే ణులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్‌చార్జిలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను నియమించారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి లోక భూమారెడ్డి, దాదన్నగారి విఠల్‌రావు, దండే విఠల్, పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి నారదాసు లక్ష్మణ్‌రావు మూల విజయారెడ్డి, అరిగెల నాగేశ్వర రావును ఇన్‌చార్జిలుగా నియమించారు. నిర్మల్, భైంసా మున్సిపాలిటీలకు దాదన్నగారి విఠల్‌రావు, ఖానాపూర్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలకు లోక భూమారెడ్డి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి దండే విఠల్, లక్షెట్టిపే ట్, మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలకు మూల విజయారెడ్డి, బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలకు అరిగెల నాగేశ్వరరావులను ఇన్‌చార్జిలుగా నియమించారు.

వీరితో టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 11న సమావేశమై మున్సిపల్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. బూత్, వా ర్డుల వారీగా కమిటీలను వేయాలని.. ఇందులో అన్ని వర్గాల వారు, మంచి పేరు, పట్టున్న వారిని తీసుకోవాలని సూచించా రు. ఈనెల 26న హైకోర్టు తీర్పు ఉన్నందున ఆ లోపే బూత్ క మిటీలను వేయాలని, తీర్పు వచ్చాక వార్డు కమిటీలను వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఇన్‌చార్జిలు తమకు అప్పగించిన మున్సిపాలిటీల్లో పర్యటించి ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. పార్టీ శ్రేణులు సిద్ధం గా ఉండాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేయాలని రాష్ట్ర నాయకత్వం సన్నద్ధం చేస్తుండ గా.. ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలు, శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

22
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles