లింగాకర్షక బుట్టల పంపిణీ

Sat,September 14, 2019 12:55 AM

బెజ్జూర్ : మండలంలోని పాపన్‌పేట పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఏఈవో శ్రీధర్ సర్పంచ్ బుజాడి శేఖర్‌తో కలిసి రైతులకు లిం గార్షక బుట్టలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగాకర్షక బుట్టల ఏర్పాటుతో పంటనాశన పురుగులను అరికట్టవచ్చాన్నారు. మొత్తం 100 మంది బుట్టలను అందజేశామన్నారు. అదేవిధంగా కిసాన్ మన్‌ధన్ యోజన పథకం కింద సన్నకారు ఐదెకరాల్లోపు పట్టా భూములు ఉన్న రైతులు, 18 నుంచి 40 ఏళ్లలోపు రైతులు అర్హులన్నారు. వయస్సును బట్టి నెలనెలా ప్రీమియం మీ సేవాలో కూ డా చెల్లించవచ్చాన్నారు. అంతకుముందు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఏయే పంటలకు లింగార్షక బుట్టలు ఎలా వాడాలో ఏఈవో రైతులకు సూచించారు. ఎంపీటీసీ లంగారి శ్రీనివాస్, ప్రత్యేకాధికారి కృష్ణం రా జు, కార్యదర్శి సంద్యా రాణి, ఎఫ్‌బీవో సందీప్, రైతులు పాల్గొన్నారు.

17
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles