యూరియా కొరత లేదు..!

Fri,September 13, 2019 04:06 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : ఈ ఏడాది వ ర్షాలు సమృద్ధిగా పడడంతో జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, కంది తదితర పంటల సాగు గణనీయంగా పె రిగింది. ఈ ఏడాది లక్షా 24 వేల 464 హెక్టార్లలో సాగు విస్తీర్ణం అంచనా కాగా.. లక్షా 35 వేల 464 హెక్టార్లలో పంటలు వేశారు. ఇందులో వరి 11405 హెక్టార్లు, పత్తి 105009 హెక్టార్లు, జొన్న 1629 హెక్టార్లు, మొక్కజొన్న 370 హెక్టార్లు, రాగి 68 హెక్టార్లు, ఇతర చిరుధాన్యాలు 44 హెక్టార్లు, కంది 11524 హెక్టార్లు, పెసర 1482 హెక్టార్లు, మినుము 469 హెక్టార్లు, ఇతర పప్పు ధాన్యాలు 26 హెక్టార్లు, నువ్వులు 7 హెక్టార్లు, ఆముదము 93 హెక్టార్లు, సో యాబీన్ 2353 హెక్టార్లు, మిరుప 18 హెక్టార్లు, ఉల్లి 22 హెక్టార్లు, ఇతర ఆహార పంటలు 945 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వీటికి సరిపడా ఎరువులను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు తెప్పించారు.

జిల్లాకు సరిపడా యూరియా..
ఈ వానాకాలం సీజన్‌లో అన్ని రకాల పంటలకు సరిపడా యూరియాను తీసుకువచ్చేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తుంది. జిల్లాకు 31,116 మెట్రి క్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేయగా.. విడతల వారీగా తెప్పిస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి 22,188 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, ప్రస్తుతం 22,875 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం దిగుమతి చేసింది. ఇందులో 2400 మెట్రిక్ టన్నుల యూరియాను ఈ ఒక్క వారంలోనే తెప్పించింది. మన జిల్లాకు ర్యాక్ పాయింట్ లేకపోవడంతో యూరి యా దిగుమతిలో కొంత ఆలస్యం ఏర్పడింది. ఇప్పటికైతే పంటలకు సరిపడా యూరియా అందుబాటు లో ఉందనీ, ఒకవేళ అవసరమైతే తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 12 పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్ 6, హలా 4 తదితర ప్రైవేటు షాపుల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నారు.

ఒకేసారి కొనుగోలు చేస్తున్న రైతులు
మొదటి, రెండో దఫాలకు అవసరమైన యూరియాను రైతులు ఒకేసారి కొనుగోలు చేస్తుడడంతో యూరియా కొతర ఏర్పడుతుంది. సాధారణంగా రైతులు సాగు సమయంలో ఎకరానికి 35 కేజీల వరకు అవసరం ఉంటుంది. కానీ రైతులు దాదాపుగా మూడు నుంచి నాలుగు రెట్లు యూరియాను ఎక్కువగా వాడుతున్నారు. అధిక వర్షాలు కురుస్తుండడంతో రైతుల అధికంగా యూరియాను వాడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వస్తున్న వార్తల నేపథ్యంలో రానున్న రోజుల్లో యూరియా దొరుకుతుందో లేదోనన్న అపోహలతో రెండు దఫాలుగా వేసే యూరియాను ఒకేసారి కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు ఉన్న భూమిని బట్టి అధికారులు యూరియాను అందిస్తున్నారు.

మానిటరింగ్ సిస్టం..
ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ఇప్పటికే అధికారులు ఫెర్టిలైజర్ మానిటరింగ్ సిస్టంను అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా దుకాణాదారులు కృతిమ కొరత సృష్టించకుండా వారికి కేటాయించిన ఎరువుల వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో ఎరువులు నల్ల బజార్‌కు తరలిపోకుండా ఉంటుంది.

అందుబాటులో యూరియా
రైతులకు కావాల్సినంత యూరియాను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా ఎప్పటికప్పుడు వారు విక్రయిస్తున్న వివరాలను తెలుసుకుంటున్నాం. ఏ మేరకు యూరియా అవసరమో.. తెలుసుకొని అప్పటికప్పుడు పంపిస్తున్నాం. యూరియా నిల్వలపై ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. ఎవరైనా యూరియాను బ్లాక్ చేస్తే డీలర్ షిప్ద్ద్రు చేయడమేగాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles