గ్రామాలాభివృద్ధే లక్ష్యం

Thu,September 12, 2019 12:37 AM

కౌటాల రూరల్: గ్రామాలాభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్ అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని మొగడ్‌దగడ్ గ్రామంలో ఆయన పర్యటించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజ లు కూడా గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. అనంతరం గ్రామానికి మొదటిసారిగా వచ్చిన ఎంపీపీని సర్పంచ్ జీజీబాయి, ఎంపీటీసీ మనీశ్‌లు సన్మానించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles