పౌష్ఠికాహారం తీసుకోవాలి :జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి

Thu,September 12, 2019 12:37 AM

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్ఠికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి అన్నారు. పోషక మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం భవన్‌లో ఐసీడీఎస్ ఆధ్వర్యం లో గర్భిణులకు సామూహిక సీ మంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి మాట్లాడుతూ గర్భిణులు పౌష్ఠికాహా రం తీసుకుంటే బిడ్డకు సమతుల్య ఆహారం లభించి, ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉం టుందన్నారు. పలువురికి వాయినాలు అం దజేసి, సీమంతం చేశారు. ఈ కార్యక్రమం లో ఎస్పీ మ ల్లారెడ్డి, జాయింట్ కలెక్టర్ రాంబాబు, సీపీవో కృష్ణయ్య, డీడబ్ల్యూవో సావిత్రి, డీపీఆర్‌వో తిరుమల, సీడీపీవో కిరణ్మయి, సూ పర్ వైజర్లు సోంబాయి, కిత, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles