మహిళల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

Thu,September 12, 2019 12:36 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: బాధిత మహిళలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం భవన్‌లో ఏర్పాటు చేసిన సఖీ కేంద్రాన్ని ఎస్పీ మల్లారెడ్డి, జేసీ రాంబాబుతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు, యువతు లు, బాలికల సంరక్షణకే స ర్కారు సఖీ కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నా రు. ప్ర స్తుత సమాజంలో స్త్రీలపై వేధింపులు అనేకంగా ఉంటున్నాయనీ, కుటుంబాల్లోనూ చి న్న చిన్న ఘర్షణలతో ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారికి అండగా నిలిచి వారికి రక్షణ, భరోసా కల్పిం చి సమస్య పరిష్కారానికి తోడ్పతాయన్నారు. ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ సెల్‌ఫోన్, వాట్సప్, ఫేస్‌బుక్‌లో పరిచయాలతో ప్రేమ పేరిటా మోసగిస్తున్నారనీ, వీటిపై అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇ బ్బందులు ఎదురైనప్పుడు సఖీ కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. కేంద్రానికి పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉం టుందన్నారు.

కేంద్రం నిర్వాహకులు సమాజానికి మెరుగైన సేవలు అందించాలన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సఖీ కేంద్రాలను మ హిళలు సద్వినియో గం చేసుకోవాలన్నారు. సేవలకు కోసం టోల్ ఫ్రీ నంబర్ 18 1ను కేటాయించడం జరిగిందన్నారు. సఖీ కేంద్రాల రాష్ట్ర కో ఆర్డినేటర్, అసిస్టెంట్ డైరెక్టర్ గిరిజా మాట్లాడుతూ మహిళలు, యువతులు, బాలికలు వేధింపులు ఎదుర్కొంటే, భరోసా కల్పించేందుకు ఒక వేదిక ఉం దని మరిచి పోవద్దన్నారు. వారికి తప్పకుండా అం డగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమం లో సీపీవో కృష్ణయ్య, మహిళ, శిశు సంక్షేమాధికా రి సావిత్రి, సెడ్స్ డైరెక్టర్ సురేందర్, జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గుర్రాల వెంకటేశ్వర్లు, వెంకట్, ఖా జామియా, మనోహర్, మంజుల, సహెరాభాను, సీడీపీవోలు, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles