గణేశ్‌ నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించాలి

Tue,September 10, 2019 11:58 PM

ఉట్నూర్‌, నమస్తే తెలంగాణ/ నార్నూర్‌: నార్నూర్‌ మండలంలోని భీంపూర్‌ గ్రామంలో మంగళవారం గణేశ్‌ నిమజ్జనం కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ పాల్గొని వినాయకుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేశ్‌ నిమజ్జనం కార్యక్రమంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, నార్నూర్‌ సీఐ రమణ మూర్తి, ఎంపీటీసీ జాదవ్‌ రేణుకాబాయి, సర్పంచ్‌ రాథోడ్‌ విష్ణు, ఆడే సురేశ్‌, కనక ప్రభాకర్‌, మాజీ సర్పంచ్‌ రాజునాయక్‌, రాథోడ్‌ ఉత్తమ్‌ పాల్గొన్నారు.

పండుగలు సంస్కృతికి చిహ్నాలు
పండుగలు సంస్కృతికి, సంప్రదాయాలకు చిహ్నాలని ఐటీడీఏ, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్‌ కనక లక్కేరావు అన్నారు. ఉట్నూర్‌ మండలంలోని లక్కారం గ్రామం హనుమాన్‌ ఆలయం వద్ద మంగళవారం నిర్వహించిన గౌరీపూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ పండుగలను ఘనంగా నిర్వహించడంతో పాటు వాటి ప్రాముఖ్యత, సంస్కృతిని రాబోవు తరాలను అందించాలన్నారు. గౌరీవ్రతం ప్రాముఖ్యతను మహిళలకు వివరించారు. సామూహిక పూజల ద్వారా తామందరం ఒకటేనన్న భావన ప్రజల్లో కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు సుధాకర్‌, సుంగు, మాజీ సర్పంచ్‌ మర్సకోల తిరుపతి, ఆలయ పూజారి రమాకాంత్‌, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles