నిషేధిత వస్తువులు విక్రయిస్తే ఊరుకోం

Fri,August 23, 2019 03:09 AM

కెరమెరి: నిషేధిత వస్తువులు విక్రయిస్తే ఊరుకునేది లేదని ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని తుమ్మగూడ గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ మల్లారెడ్డి పోలీసు బలగాలతో గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. తాండలో గుడుంబా, గుట్కా విక్రయాలపై గ్రామస్తులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

నిషేధిత వస్తువులు, గుడుంబా, గుట్కాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలనీ, పత్రాలు లేకుండా, డ్రైవింగ్ లైసెన్సు లేని వారు వాహనం నడిపిస్తే కొత్తచట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మద్యం తాగి, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే జరిమానాతో పాటు శిక్ష తప్పదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, ఎస్ రమేశ్ పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles