సంస్కృతి, సంప్రదాయాలు అందించాలి

Fri,August 23, 2019 03:08 AM

ఉట్నూర్, నమస్తే తెలంగాణ: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. గురువారం స్థానిక ఆయన నివాసంలో ఉట్నూర్ సాహితీ వేదిక కవి బంకట్‌లాల్ రూపొందించిన బంజారా తీజ్ ఉత్సవ సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బంకట్‌లాల్ కవి తీజ్ సీడీని రూపొందించడం సంతోషకరమన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడ కవి తనపాత్ర చురుకుగా పోషించారన్నారు. కార్యక్రమంలో బంజారా నాయకులు బానోత్ రామారావు, జాదవ్ రమణానాయక్, జాదవ్ చంద్రకాంత్, ఆడే ప్రకాశ్, కపిల్ కుమార్, ఉట్నూర్ సాహితీ వేదిక అధ్యక్షుడు కొండగుర్ల లక్ష్మయ్య, ఇందల్, కుమ్ర లాల్‌షావ్, అజ్మీరా భూమేశ్ పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles