జానపదం.. గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబం

Fri,August 23, 2019 03:07 AM

దహెగాం : జానపద కళలు గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబం అని జానపద కళాకారుల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అనుమాండ్ల మధుకర్ పేర్కొన్నారు. ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలో కళాకారులు కేక్ కట్‌చేసి, సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ.. జానపదాలు పల్లె జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. ప్రతి జానపద పాటలోనూ ఎంతో అర్థం ఉంటుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ, జానపదాలకు పుట్టినిళ్లు అని అన్నారు. ప్రభుత్వం కూడా జానపద కళాకారులను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోగరి రాజ్‌కుమార్, సీనియర్ జానపద కళాకారుడు కంబగౌని కేశగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గురిజాల రాజబాబు, ఉపాధ్యక్షుడు సుంకరి బాపు, పందిర్ల బాపు, పందిర్ల మల్లేశ్, ప్రచార కార్యదర్శి రాజాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles