అటవీకి పునర్జీవం

Thu,August 22, 2019 12:30 AM

-అడవులకు ఆయుష్షు పోస్తున్న తెలంగాణ ప్రభుత్వం
-యుద్ధప్రాతిపదికన అటవీ పునర్జీవ పనులు
-8,965 ఎకరాల్లో కొనసాగింపు

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: అటవీ పునర్జీవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అడవులను తిరిగి సృష్టిస్తోంది. గత పాలకు ల హయాం లో కలప స్మగర్లు విచ్చల విడిగా కలప తరలించారు. అడవులకు నిలయంగా ఉన్న కుమ్రం భీం జిల్లాలో మరింత చెట్లు పెంచేందుకు సిద్ధమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప చ్చదనం వైపు దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగా రు. తెలంగాణకు హరితహారం పేరిట అన్ని చోట్ల మొక్కలు నాటేలా చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా మొక్కల పెంపకం, వాటిని నాటడం, నా టిన వాటిని సంరక్షించడం ధ్యేయం గా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే నా లుగు విడతలుగా కొనసాగిన హరితహారంలో భా గంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటా రు. ప్రతి ఏటా కోట్లలో మొక్కలు నాటుతూ ముం దుకు సాగుతున్నారు. ఈ హరితహారం ద్వారా ఆ యా గ్రామాలు, పట్టణాలు, కాలనీలు పచ్చదనం సంతరించుకున్నాయి. కేవలం ప్రభుత్వమే కాకుండా, జిల్లాలో సింగరేణి, ఇతర సంస్థలు హరితహారంలో పాలు పంచుకునేందుకు ముందుకు వస్తున్నాయి.

జిల్లాలో 8,965 ఎకరాల్లో..
జిల్లాలో ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న అడవుల్లో ఈ అడవుల పునర్జీవ పథకం కొనసాగిస్తున్నారు. జిల్లాలోని రెండు ని యోజవకవర్గాల్లో మోడు వారిన అడవులు ఉన్న ప్రాంతాల్లో ఈ మొక్కలు నాటుతున్నారు. రెండు ప ద్ధతుల ద్వారా వీటిని నాటుతున్నారు. ట్రాక్టర్లు, యంత్రాల ద్వారా(సెమీ మెకానికల్ మెథడ్), కూలీ ల ద్వారా(లేబర్ ఇంటెన్ఫికేషన్), మొక్కల పెంపకం చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 8,965 ఎకరాల్లో ఈ అటవీ పునర్జీవ కార్యక్రమాలు కొనసాగుతున్నా యి. ఓపెన్‌కాస్టులు, ఇతర ప్రాజెక్టుల కింద అటవీ భూమి కోల్పోయిన చోట ఇతర ప్రాంతాల్లో మొక్క లు నాటే కార్యక్రమం చేపడుతున్నారు.

పచ్చబడనున్న అడవులు..
క్షీణించిన అడవులు పచ్చబడేందుకు అటవీ పునర్జీవ పథకం కింద మొక్కలు నాటడంతో అడవులు పచ్చబడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80 కోట్ల మొ క్కలు నాటి అడవులు పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ రీజువెనేషన్ కార్యక్రమం చేపట్టింది. మొదట అటవీ సరిహద్దులను గుర్తించి చొరబాట్ల ని వారణకు ట్రెంచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ధ్వంసమైన అడవిని ఎయిడెడ్ నేచురల్ రీజనరేషన్(ఏఎన్‌ఆర్) పద్ధతిలో జీవం పోశారు. వచ్చే ఏడాది ఆఖరు కల్లా ట్రెంచ్‌ల తవ్వకం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో అడవులు పచ్చబడతాయని అటవీశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని వారంటున్నారు. జిల్లాలో జన్నారం ప్రాంతంలో మినహా ఎక్కడా కూడా అడవులు పూర్తి స్థాయిలో పచ్చగా లేవు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని వారు చెబుతున్నారు. అడవులు పచ్చబడితే కేవలం మనకు పచ్చదనమే కాకుండా, వన్యప్రాణుల సంతతి సైతం పెరుగుతుందని చెబుతున్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles