ఈవోపీఆర్డీగా కిరణ్‌జైన్

Tue,August 20, 2019 12:31 AM

కెరమెరి: కెరమెరి మండల విస్తీర్ణ అధికారిగా బీ కిరణ్‌జైన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రెబ్బెన ఈవోపీఆర్డీగా పని చేసిన ఆయన డిప్యూటేషన్‌పై కెరమెరికి వచ్చారు. ఇక్కడ ఈవోపీఆర్డీగా పని చేసిన పంచాయతీ కార్యదర్శి బుర్స పోచ య్య నుంచి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో సమష్టిగా పని చేస్తూ పంచాయతీల అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

19
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles