సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Sat,August 17, 2019 11:58 PM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: సంక్షేమ పథకాల ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీ సీ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. స్థానిక మండ ల పరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం ఉజ్వల దినోత్సవం సందర్భంగా గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం ద్వారా మంజూరైన గ్యాస్ సి లిండర్లను ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిరుపేదలను దృ ష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నాయన్నారు. వీటిని అర్హులకు అందేలా స్థానిక అధికారులు, ప్ర జా ప్రతినిధులు కృషి చేయాలని కోరారు. దీంతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సుంకరి మంగళ, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంధం శ్రీనివాస్, సర్పంచులు భీమేష్, బాపురావు, భా రత్ గ్యాస్ డీలర్ రాజేశ్వర్, తదితరులున్నారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles