చట్టాలపై అవగాహన ఉండాలి: జడ్జి నారాయణ బాబు

Sat,August 17, 2019 11:58 PM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని న్యాయమూర్తి పట్లావత్ నారాయణబాబు అన్నారు. జిల్లా కేంద్రం లోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. ర్యాగింగ్‌తో విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఆడపిల్లలను ఆకతాయిల నుంచి రక్షించేందుకు ప్రత్యేక చట్టలు ఉన్నాయని పేర్కొన్నారు. న్యాయ చట్టాలను వివరిస్తూ, విద్యార్థులకు చదువు ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్‌కు చ క్కటి బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ, బార్ అధ్యక్షుడు నిరోడె రవీందర్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, న్యాయవాదులు శ్రీనివాస్, ప్రసాద్, రవి, తదితరులున్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles