నాసికరం విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్

Mon,May 27, 2019 02:50 AM

-కొనుగోలు సమయంలో రశీదు తప్పనిసరి
- యువత చెడుకు దూరంగా ఉండాలి
- పోలీసుశాఖ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తాం
- ఎస్పీ మల్లారెడ్డి
- ఖమానలో పలు దుకాణాల తనిఖీ
వాంకిడి : నాసిరకం విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ మల్లారెడ్డి హెచ్చరించారు. మండలంలోని ఖమాన గ్రామంలో ఆదివారం డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. మద్యం, పలు విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం రైతులనుద్ధేశిచి ఎస్పీ మాట్లాడుతూ అనుమతి ఉన్న విత్తనాలు, ఎరువులను, పురుగు మందులను మాత్రమే అమ్మాలన్నారు. అంతేగాకుండా రైతులను వీటికి సంబంధించిన రసీదులు ఇవ్వాలన్నారు. గ్రామంలో ఎవరైన నాసిరకం విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అలాగే యువత గొడవలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామంలోని నిరుద్యోగ యువకులకు పోలీస్‌శాఖ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల యువకులు తమ ధ్రువీకరణ పత్రాలతో స్థానిక పోలీస్‌స్టేషన్ దరఖాస్తు చేసుకుంటే ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వాంకిడి సీఐ వేణుగోపాల్, ఎస్‌ఐ చంద్రశేఖర్, ఖమాన పెందుర్ సర్పంచ్ పవన్ తదితరులున్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles