పులుల ఆవాసానికి ఏర్పాట్లు షురూ

Mon,May 27, 2019 02:50 AM

-తాంసి, భీంపూర్ మండలాల్లో టైగర్ కారిడార్
-అడవుల్లో సెన్సర్ కెమెరాలు..
- జూన్ 10 వరకు పనులు
భీంపూర్ : పులుల ఆవాసానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. తాంసి, భీం పూర్ మండలాలు సహా ఇతర ప్రాంతాల్లో పులి ఆవాస యోగ్యానికి ఎంపిక చేసిన స్థలాల్లో సోమవారం నుంచి సెన్సార్ మూవ్‌మెంట్ కెమెరాల ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 10 వరకు ఇది కొనసాగనున్నట్లు ఎఫ్‌ఆర్వో అప్పయ్య, ఎఫ్‌ఎస్‌వో రణవీర్ తెలిపారు.

-అటవీసంరక్షణ కోసం ..
కవ్వాల్ అభయారణ్యం తదితర ప్రాంతాల నుం చి ఇక్కడికి పులులను రప్పిస్తే అటవీ సంరక్షణ జరుగుతుందనేది అధికారులు భావిస్తున్నారు. అయితే పెద్ద పులి నివాసం ఉండాలంటే ఆ అడవుల్లో శాఖాహర జంతువులు విరివిగా ఉం డాలి. నీటి వనరులుండాలి. అంతేగాకుండా వెదురు పొదలు, గుహలు ఉండా లి. ఇవన్నీ స్థానిక అడవుల్లో ఉన్నదీ లేనిదీ అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయి లో అధ్యయనం చేస్తున్నారు. ఇందులోభాగంగానే సెన్సార్ మూవ్‌మెంట్ కెమెరాలు అమర్చనున్నారు. ఈ కెమెరాల మెమోరీలలో అడవుల్లో సంచరించే శాఖాహార జంతువుల ఫొటోలు న మోదు కానున్నాయి. ఈ శాఖాహార జంతుజాలానికి కూడా సరైన గడ్డిగాదం గమనించి పెంపకానికి చర్యలు తీసుకుంటారు. అంతిమంగా పులి నివాస యోగ్యాలుగా ఇక్కడి అటవీప్రాంతాలను తీర్చిదిద్దనున్నారు.

-తాంసి, భీంపూర్ అడవుల ప్రాధాన్యత..
తాంసి, భీంపూర్ మండలాల్లో సుమారు 5000 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వీటిలో జింకలు, మనబోతులు , కుందేళ్లు సహా ఇతర పక్షిజాతులు విరివిగా ఉన్నాయి. గతంలో హైదరాబాద్ నుంచి వేటగాళ్లు వచ్చి గొల్లగడ్, బేల్సరిరాంపూర్ అడవుల్లో వేటాడిన ఉదంతాలు ఉన్నాయి. తర్వాత తెలంగాణ ప్రభుత్వం అటవీ సంరక్షణ చర్యల్లో భాగంగా తాంసి, భీంపూర్ అడవుల చుట్టూ లోతైన కందకాలు తవ్వించింది. ఇపుడు ఈ అడవుల్లోకి కలప స్మగ్లర్లు వెళ్లడం అంత సుల భం కాదు. అలాగే హరితహారంలో నాటిన వివిధ జాతుల చెట్లు వృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం తాంసి మండలంలోని లీమ్‌గూడ ప్రాంతంలో చి రుత సంచారం నేపథ్యంలో నీటి మడుగుల వద్ద సీసీ కెమెరాలను అమర్చారు. 2016 డిసెంబరు లో తాంసి సమీప బోడగుట్ట మీద ఆరేళ్ల వయసు న్న ఆడ చిరుత అనారోగ్యంతో మృతి చెందింది. ఆ అనుభవంతో అధికారులు ఇప్పుడు చిరుత సంరక్షణ చర్యలు ముమ్మరం చేశారు.

అలాగే 2016 డిసెంబరులోనే భీంపూర్ మండలం పిప్పల్‌కోటి, గొల్లగడ్, తాంసి(కె) అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. అప్పటీ డీఎఫ్‌వో రాంబాబు జన్నారం నుంచి నిపుణులను రప్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ పులి మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి తప్పించుకుని వచ్చిందని భావించి అప్పటి మహారాష్ట్ర పాండ్రకవడ డీఎఫ్‌వో గురుప్రసాద్ కూడా పిప్పల్‌కోటి అడవులకు వచ్చి రాష్ట్ర అటవీ అధికారులకు సహకారం అందించారు. అయితే తర్వాత ఆ పులి జాడ తెలియలేదు. ఈ సంఘటనల నేపథ్యంలో ఇప్పుడు అధికారులు టైగర్ కారిడార్ ఏర్పాటులో ఈ మండలాల అటవీప్రాంతాలను ప్రాధాన్యతగా తీసుకున్నారు.

-పులుల ఆవాసానికి చర్యలు..
తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పు లులు కవ్వాల్ అభయారణ్యం వైపు వ చ్చేలా చర్యలు తీ సుకుంటున్నాం. ఇందు కో సం జిల్లాలోని వివి ధ అటవీ ప్రాం తాల్లో శాఖాహార జంతుగణన కోసం ఇప్పటికే సీసీ కెమెరాలు పెట్టినం. ఇంకా గుర్తించిన ప్రాం తాల్లో కూడా జూన్ 10 లోగా సీసీ కెమెరాలు అమర్చుతాం. అంతేగాకుండా అట వీ సంరక్షణ ,పర్యావరణ సమతూల్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
- ఏ.అప్పయ్య, ఎఫ్‌ఆర్వో ,ఆదిలాబాద్ రేంజ్

-జంతుగణన సాగుతున్నది..
పులుల ఆవాసానికి అవసరమైన శాఖాహార జంతుగణన కొనసాగుతున్నది. తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులి గతం లో పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల్లో సంచరించినట్లు తెలిసింది. ఇంకా స్థానికంగా అడవుల్లో కూడా పులులకు అనువైన ఆవాసం ఉందా..? లేదా..? అని పరిశీలిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
- జే. రణవీర్, ఎఫ్‌ఎస్‌వో, తలమడుగు, తాంసి

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles