కల సాకారం దిశగా..

Mon,May 27, 2019 02:50 AM

- పీకలగుండం ఎర్రవాగుపై వంతెన పనులు ప్రారంభం
-ఎల్‌డబ్ల్యూ నిధులు రూ. 13 కోట్లతో నిర్మాణం
-పూర్తయితే మంచిర్యాలకు తగ్గనున్న దూర భారం
-ఆయా గ్రామాల ప్రజల హర్షం
దహెగాం : మండలంలోని పీకలగుండం గ్రామస్తుల దశాబ్దాల కల త్వరలోనే నేరవేరనున్నది. ఎమ్మెల్యే కోనప్ప చొరవతో ఎర్రవాగుపై వంతెన నిర్మాణానికి నిధు లు మంజూరయ్యాయి. పనులు కూడా వారం క్రితం ప్రారంభమయ్యాయి. ఇది పూర్తయితే మంచిర్యాలో జిల్లాలోని పలు ప్రాంతాలకు దూరభారం తగ్గనున్నది. నక్సల్స్ ప్రభావిత (ఎల్‌డబ్ల్యూ) నిధులు రూ. 13 కోట్లతో వం తెన పనులు కొనసాగుతున్నాయి. ఇందు లో 14 ఫిల్లర్లతో పాటు రెండు అపార్టుమెంట్స్ నిర్మిస్తున్నా రు. ఒక్కొక్క ఫిల్లరు మధ్య 16 మీటర్ల, 60 సెంటిమీటర్ల వ్యవధితో పనులు చేపట్టారు. ఈ వంతెన నిర్మాణంతో సిర్పూర్ నియోజక వర్గంతో పాటు బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ నియోజక వర్గాలకు రవాణ సౌకర్యం ఎంతో మెరుగుపడనున్నది. అంతేగాకుం డా వందల కిలోమీటర్ల దూర భారం కూడా తగ్గనున్నది. అదేవిధంగా మహారాష్ట్రకు కూడా రవా ణా సౌకర్యం ఎంతో దగ్గ ర కానున్నది. సిర్పూర్, బెల్లంపల్లి, మం చిర్యాల, చె న్నూర్ నియోజక వర్గాల్లో బం ధుత్వాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వంతెన నిర్మాణంతో ఏ కాలమైనా రాకపోకలకు సాగించే అవకాశం కలుగుతుందనీ, ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

-సంతోషంగా ఉంది..
రవాణ సౌకర్యం మెరుగుపడితే ఆ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ రోడ్ల నిర్మాణంపై ఎక్కువ దృష్టిపెట్టి కోట్ల రూపాయలతో రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నాడు. పీకలగుండం సమీపంలో ఎర్రవాగుపై నిర్మించే వంతెనతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అంతేగాకుండా ఇక్కడి భూములకు కూడా డిమాండ్ వస్తది అంతేగాకుండా 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది.
-దర్గం ఓంప్రకాశ్ విద్యార్థి , పీకలగుండం

-సౌకర్యంగా ఉంటది..
పీకలగుండం, చింతపుడి గ్రామాల మధ్య ఎర్రవాగుపై వంతెన కడుతారని కల లో కూడా అనుకోలె. ఈ ప్రాంతంలో మాకు బంధువులు ఉన్నా రు. అయితే వర్షాకాలంలో వాగు పొంగడంతో రాకపోకలు ఉండేవి కావు. గతంలో దహెగాంలో చదువుకునే ఒకరు ఇంటికి వచ్చేటప్పుడు వాగు దాటుతుండగా వరద ఎక్కువగా వచ్చి వాగులో మునిగి చనిపోయినాడు. ఇప్పుడు ఈ వంతెన నిర్మాణంతో మాకు ఎంతో సాక ర్యం ఉంటది.
-మడె వెంకటేశ్, చింతపుడి

-ఎమ్మెల్యే కోనప్ప కృషితోనే..
ఎమ్మెల్యే కోనప్ప కృషితోనే పీకలగుండం దగ్గర ఎర్ర వాగుపై వంతెన ని ర్మాణం ప్రా రం భమైంది. ఎమ్మెల్యే అప్పట్లో చెప్పిండు వంతెన కట్టిస్తానని అన్నమాటనిలబెట్టుకున్నాడు. ఈ వంతెన పూర్త యితే చెన్నూరు 30 కిలోమీటర్ల దూరమే ఉంట ది. చెన్నూరు, వేమనపల్లి, కోటపల్లి చాల దగ్గర అవుతది. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. తెలంగాణ వచ్చినంకా రోడ్డు, వంతెనలు బాగా కడుతున్నారు.
-గొండె నానయ్య రైతు , కొంచవెల్లి

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles