28న జరిగే డిగ్రీ పరీక్షలు వాయిదా

Mon,May 27, 2019 02:48 AM

రెబ్బెన: ఈ నెల 28వ తేదీన జరగాల్సిన కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా వేశామని ్ల రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎంఎ జాకీర్ ఉస్మాని ఒక ప్రకటనలో తెలిపారు. 28న జరుగనున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు అనేక మంది విద్యార్థులు రాస్తున్న కారణంగా బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ డిగ్రీ మూడవ, ఆరవ సెమిస్టర్ డిగ్రీ రెండవ సంవత్సరం పరీక్షలు వాయిదా వేస్తున్నామని కాకతీయ యూనివర్సిటీ పరీక్ష నియంత్రణ అధికారి మహేందర్‌రెడ్డి, అదనపు పరీక్ష నియంత్రణ ఆధికారులు సదానందం, వెంకయ్య తెలిపినట్లు పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles