మద్యం తాగి వాహనాలు నడిపిస్తే కేసులు

Mon,May 27, 2019 02:48 AM

జైనూర్: నిబంధనలకు విరుద్దంగా మద్యం తాగి వాహనాలు నడిపిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జీపు, ఆటోల యజమానులు లైసెన్సు లేని వారికి వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించవద్దని, మద్యం తాగి వాహనాలు నడిపించడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్‌తో పాటు లైసెన్స్, తదితర ధ్రువపత్రాలు వాహనదారులు వెంట ఉంచుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలు లేనివారికి ఆన్‌లైన్ ద్వారా జరిమానా రశీదులు ఇచ్చారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles