సర్కారు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

Sat,May 25, 2019 11:53 PM

-జిల్లాకు రూ. 7 లక్షలు మంజూరు
-3,500 కుటుంబాలకు గిఫ్ట్ ప్యాకులు పంపిణీ
-కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
-ఎస్పీ మల్లారెడ్డితో కలిసి మసీద్ కమిటీలతో సమావేశం
ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ : రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ మల్లారెడ్డితో కలసి సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విందు కోసం జిల్లా కు రూ. 7 లక్షలు నిధులు మంజూరయ్యాయన్నా రు. ఆసిఫాబాద్ నియోజవర్గానికి రూ.3 లక్షలు, సిర్పూర్ నియోజవర్గానికి రూ. 4 లక్షలు కేటాయిస్తామని చెప్పారు. అంతేగాకుండా ఆసిఫాబాద్ డివిజన్‌లో 1500, కాగజ్‌నగర్ డివిజన్‌లో 200 0 మంది మొత్తం 3500 మంది పేద ముస్లింల కు టుంబాలకు గిఫ్ట్ ప్యాకెట్లు అందిస్తామన్నారు. రంజాన్ పండుగను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సామరస్యంగా జరుపుకోవాలని సూచించారు. మసీదు కమిటీ పెద్దలు మాట్లాడుతూ గిఫ్ట్ ప్యాకెట్స్ , ఇఫ్తార్ విందుకు ఇచ్చే నిధులు సరిపోవనీ, నిధులను పెంచాలనీ కలెక్టర్‌ను కోరారు. ఆయన స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వచ్చే రంజాన్ నాటికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో జేసీ రాంబాబు, ఆర్డీవోలు సిడాం దత్తు, శివకుమార్, మైనార్టీ సంక్షేమాధికారి శ్రీనివాస్, మసీదు కమిటీల సభ్యులు షేక్ అసద్, సలామొద్దీన్, జాకీర్, సుభాన్, ఖాదీర్, తదితరులున్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles