ఉన్నత విద్యను అభ్యసించాలి

Sat,May 25, 2019 11:52 PM

జైనూర్: విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని ఏటీడీవో ఆత్రం భాస్కర్ సూచించారు. మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు శనివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ, ఈ సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంటర్‌లో ఎలాంటి ఇబ్బందులుకాకుండా ఉండేందుకు నెల రోజుల పాటు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించామన్నారు.. ఈ తరగతులతో పాటు కమ్యునికేషన్ స్కిల్ డెవలప్‌మెంట్‌పై అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో జైనూర్, పాట్నాపూర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సోనెరావ్, భీంరావ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles