ఆంగ్లంపై పట్టు సాధించాలి

Sat,May 25, 2019 11:51 PM

కాగజ్‌నగర్ టౌన్ : ఆంగ్లంపై పట్టు సాధిస్తే భవిష్య త్ మరింత ఉన్నతంగా ఉంటుందని డీటీడీవో దిలీ ప్ కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 30 రోజులుగా ఇస్తున్న ఉచిత స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు పై చదువుల్లో ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లోని 70 మంది విద్యార్థులకు నెల రోజుల పాటు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. శిక్షణతో పాటు భోజన వసతి కూడా కల్పించినట్లు చెప్పారు. అనంతరం ఆయన విద్యార్థులతో ఇంగ్లిష్‌లో మాట్లాడగా వారు సమాధానం చెప్పడంతో ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏటీడీవో నీలిమ, ఉపాధ్యాయులు ప్రసాద్, మహేశ్, శంకర్, గోపాల్, నాందేవ్, ఏసీ ఎం ఉద్దవ్, శ్రీనివాస్, మహేశ్, రిసోర్స్ పర్సన్లు శ్రీవాణి, సాజీద్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles