విద్యార్థులకు బహుమతులు అందజేత

Sat,May 25, 2019 11:51 PM

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: స్వేరోస్ విక్టరీ డే సందర్భంగా ప్రతిభ చూపిన సాంఘిక సంక్షేమ గురుకుల, గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులకు శనివారం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్ణ, ఆనంద్ విజయాన్ని పురస్కరించుకొని యేటా స్వేరో విక్టరీ డేను నిర్వహించడం అభినందనీయన్నారు. విద్యార్థులను ప్రోత్సాహిస్తే వారు మరింత ఉన్నత స్థానాలకు వె ళ్లే అవకాశం ఉంటుందన్నారు. స్వే రో నార్త్ జోన్ సంయుక్త కార్యదర్శి హేమంత్ షిం డే, జిల్లా అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి చైత న్య కుమార్, స్వేరోస్ నాయకులు శ్రీనివాస్, నవీ న్, ప్రవీణ్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles