నాణ్యతపై అవగాహన అవసరం

Sat,May 25, 2019 01:58 AM

-రాష్ట్ర నాణ్యతా ప్రమాణాల అధికారి డాక్టర్ రవినాయుడు
-రెబ్బెన పీహెచ్‌సీలో రికార్డుల పరిశీలన
రెబ్బెన: నాణ్యత ప్రమాణాలు పాటించి అందరికీ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర నాణ్యతా ప్రమాణాల అధికారి రవినాయుడు సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని శుక్రవారం ఆయన సందర్శించారు. జాతీయ నాణ్యతా ప్రమాణాల ప్రకా రం ఆసుపత్రిలో 6 విభాగాలు పరీశీలించారు. ఈ సందర్భం గా ఓపీలు, ప్రసవాలు, దవాఖానలో పరిశుభ్రతను పరిశీలించారు. ప్రతినెలా ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నా రు. అనంతరం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, కొంత వరకు మార్పు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీ లో నాణ్యతా పాటించినపుడే రోగులు సంతృప్తిగా ఉంటారన్నారు. జాతీయ నాణ్యతా ప్రమాణాల పరిశీలనలో 70శాతం మార్కులు సాధిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి పారితోషికం అందిస్తారన్నారు. అందులో నుంచి 25 శాతం దవాఖాన సిబ్బందికి, 75శాతం దసుపత్రి అభివృద్ధికి చెందుతాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సుధాకర్‌నాయక్, జిల్లా నాణ్యతా ప్రమాణాల అధికారి ధరంసింగ్, వైద్యాధికారి డాక్టర్ వినోద్, సిబ్బంది పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles