నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు

Sat,May 25, 2019 01:58 AM

-వ్యాపారులపై నిఘా పెట్టాం
-తప్పుచేస్తే తప్పించుకోలేరు
-విలేకరుల సమావేశంలో ఎస్పీ మల్లారెడ్డి
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో గతేడాది నకిలీ పత్తి విత్తనాలు విక్రయించిన 35 కేసులలో 65 మందిని అరెస్ట్ చేశామనీ, వారి నుంచి రూ. 33,47,729 విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గతంలో నేరాలకు పాల్పడిన 35 మందిని సంబంధిత తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశామన్నారు. నకిలీ పత్తి విత్తనాలను విక్రయించకుండా వ్యాపారులపై నిఘా పెట్టామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడు కేసులను నమోదు చేసి 14 మందిపై కేసులు నమోదు చేసి రూ. 21,14400 విలువైన పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు నలుగురిని బైండోవర్ చేసినట్లు చెప్పారు. నాలుగు నుంచి ఐదు కేసులు నమోదైన వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తున్నామన్నారు.

ఇప్పటికే జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన నలుగురిపై పీడీ యాక్టు నమోదు చేశామనీ, మరో నలుగురిని గుర్తించినట్లు చెప్పారు. రైతులు నిషేధిత బీటీ-3 ైగ్లెసిల్ విత్తనాలను వాడవద్దనీ, వీటి ద్వారా భూసారం తగ్గిపోవడంతో భవిష్యత్తులో పంటలు పండే అవకాశం ఉండదన్నారు. వ్యవసాయ శాఖ సూచించిన విత్తనాలనే కొనుగోలు చేయాలన్నారు. దళారులు చెప్పిన మాయ మాటాలు నమ్మి మోసపోవద్దన్నారు. రైతులు విత్తనాల,ఎరువులు కొనగోలు చేసినప్పుడు తప్పకుండా రశీదు తీసుకోవాలన్నారు. రశీదు ఉంటే పంట నష్ట పోయిన సమయంలో కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి నష్ట పరిహారం పొందవచ్చని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు ఎవరైనా విక్రయించినా, నిల్వ ఉంచినా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలనీ, వారి వివరాలు గోప్యంగా ఉంచుతా మన్నారు. సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ తదితరులున్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles