పౌల్ మృతిని గని ప్రమాదంగా గుర్తించాలి

Thu,May 23, 2019 01:11 AM

రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలోని కైర్‌గూడ ఓసీపీలో మృతి చెందిన శనిగారపు పౌల్ మృతిని సింగరేణి యాజమాన్యం గని ప్రమాదంగా గుర్తించి, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని కైర్‌గూడ ఓసీపీని బుధవారం టీబీజీకేఎస్ నాయకులు సందర్శించి పాల్ మృతిపై తోటి కార్మికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం కొంత మంది కార్మికులు భోజనాలకు వెళ్లగా మరికొంత మందితో పౌల్ అక్కడే ఉన్నాడు. క్రషర్‌ను అన్ చేసేందుకు పౌల్ వెళ్లాడు. పాల్ ఒక్కసారిగి కింద పడి క్రషర్ డ్రమ్ముల వద్ద కొన ఊపిరితో కనిపించాడని తోటి కార్మికులు తెలిపారు. అంతకుముందుకు వరకూ తమతో బాగానే మాట్లాడాడని తెలిపారు. పౌల్ మృతిపై విచారణ జరిపి గని ప్రమాదంగా గుర్తించాలని కోరారు. పౌల్ కుటుంబానికి టీబీజీకేఎస్ యూనియన్ ఎల్లవేళల అండగా ఉంటుందని అన్నారు. సందర్శించిన వారిలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్‌రావు, ఏరియా కార్యదర్శి పసుల శంకరయ్య, పిట్ కార్యదర్శి తాళ్లపల్లి రాములు, ఏరియా అసిస్టెంట్ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఉన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles