ప్రారంభం రోజునే పుస్తకాలు

Thu,May 23, 2019 01:10 AM

కాగజ్‌నగర్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జూన్ 1 స్కూళ్ల పున: ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, హైజనిక్ కిట్లు అందుకోనున్నారు. ఇందు కు సంబంధించి 10 రోజుల ముందుగానే అధికారులు సర ఫరా చేసిన పాఠ్యాపుస్తకాలు, యూనిఫారాలు, బాలికలకు 13 రకాలతో కూడిన 1721 హైజనిక్ కిట్లు మండల విద్యావనరుల కేంద్రానికి చేరుకున్నాయి. కాగజ్‌నగర్ మండలం లో 101 పాఠశాలల్లో 9వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 52వేల పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉం డగా, మొదటి విడతగా 28 వేల అందుబాటులో ఉన్నాయి. రెండో విడతలో మిగితా పుస్తకాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కోడ్ ఆధారంగా పంపిణీ..
ప్రభుత్వం విద్యా విధానంలో సమూలమైన మార్పులను తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అగుడుగులేస్తోంది. అందులో భాగంగా పారదర్శకతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీని పక్కాగా చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతీ పుస్తకానికి ఒక కోడ్ నెంబర్‌ను ముద్రించింది. అందజేసిన పాఠ్యాపుస్తకం పక్కదా రి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. దీంతో ఏ కోడ్ నెంబరు ముద్రించిన పుస్తకం ఏ పాఠశాలలో పంపిణీ జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. ఫలితంగా ప్రభుత్వం అందించే ఏ ఒక్క పాఠ్యాపుస్తకం పక్కదారి పట్టకుండా ఉంటుంది.

ప్రారంభం రోజునే అందజేస్తాం..
కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పా ఠశాల పునః ప్రారంభంరోజునే పాఠ్యపుస్తకాలను అందేలా చర్యలు తీసుకుంటున్నాం. వీటి తో పాటు యూనిఫాం, బాలికలకు హైజనిక్ కిట్లను కూడా పంపిణీ చేస్తాం. కాగజ్‌నగర్ మండలంలో 52 వేల పుస్తకాలకు 28 వేల పుస్తకాలు, దహెగాం మండలంలో 21 వేల పుస్తకాలకు 17 వేల పుస్తకాలు వచ్చాయి. కాగజ్‌నగర్‌లో 9వేలు, దహెగాం లో 2800 విద్యార్థులు ఉన్నారు. పంపిణీ చేసిన పుస్తకాల వివరాలను ఆన్‌లైన్‌లో కోడ్ ఆధారంగా నమోదు చేస్తాం.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles