సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

Thu,May 23, 2019 01:10 AM

దహెగాం: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీపీ చిలువేరు కల్పన అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ముందుగా ఇన్‌చార్జి ఎంఈవో భిక్షపతి మాట్లాడు తూ మండలంలో 53 పాఠశాలలు ఉన్నాయనీ, అందులో 3000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. 11 4 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా, వీరి స్థానంలో విద్యావలంటీర్లు బోధిస్తున్నారన్నారు. అదేవిధంగా 6 నుం చి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యకి ట్లు, పుస్తకాలు, దుస్తులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చె ప్పారు. అనంతరం డా. చంద్రకిరణ్ మాట్లాడుతూ మండలంలో ప్రస్తుతం ఎన్‌సీడీ సర్వే కొనసాగుతున్నాదనీ, మొ త్తం 11 వేల మంది 30 ఏళ్ల పైబడిన వారు ఉండగా, ఇప్పటివరకు 5200 మందికి బీపీ, షుగర్, కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేశామన్నారు. అటవీప్రాంతంలోని గిరవెల్లి ఉపకేం ద్రం పరిధిలోని అన్ని గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించామని చెప్పారు. టీబీ, లెప్రసీ కేసులకు కూడా వైద్యం అం దిస్తున్నామని తెలిపారు. మండలంలో తరచూ విద్యుత్ సమస్య తలెత్తుతున్నదనీ, మరీ ముఖ్యంగా అటవీప్రాంత మొట్లగూడ, రాంపూర్, దిగిడ గ్రామపంచాయతీల పరిధిలో తీవ్రంగా ఉందనీ స్థానిక సర్పంచులు సభా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఏఈ రవీందర్ స్పందిస్తూ జం బుగా నుంచి దహెగాంకు వచ్చే 33 కేవీ పాతలైన్ కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయనీ, ఇప్పటికే మరమ్మతుల్లో భాగంగా ఆ లైన్‌కు 70 స్తంభాలు ఏర్పాటు చేయగా, మరో 25 వేసేందుకు పనులు జరుగుతున్నాయని చెప్పారు. మొట్లగూడ, దిగిడ, రాంపూర్ గామాలకు కొత్తలైన్ పనులు సాగుతున్నాయని పూర్తయితే సమస్యలుండవని పేర్కొన్నా రు. సదరు గ్రామంలో బిల్లులు చెల్లించేలా సర్పంచులు కృషిచేయాలని కోరారు. తాగునీరు, పశువైద్యం తదితర అంశాలపైనా చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షురాలు నేరేళ్ల శైలజ, ఎంపీడీవో కుటుంబరావు, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యు లు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles