ఇంటింటా మరుగుదొడ్డి తప్పనిసరి

Thu,May 23, 2019 01:09 AM

బెజ్జూర్ : స్వచ్ఛ్ భారత్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి గంగాధర్ కార్యదర్శులకు సూచించారు. మండల పరిషత్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రూ.12 వేలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ మల విసర్జన మానుకొని, మరుగుదొడ్డిని వాడుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యదర్శులు, సర్పంచులతో కలిసి గ్రామపంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గ్రా మ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు చేయాలని సూచించారు. విధులు సక్రమంగా నిర్వహిస్తూ, అభివృద్ధి పనులతో గుర్తింపు తెచ్చుకోవాలని కార్యదర్శులకు సూచించారు. అంతకుముందు సర్పంచులు, కార్యదర్శులు డీపీవో గంగాధర్ గౌడ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో దుర్గం తోటాజీ, ఏపీవో శాకిర్ ఉస్మాని, స్వచ్ఛ్ భారత్ మిషన్ కో ఆర్డినేటర్ ప్రశాంత్, సర్పంచులు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles