చదువుతోనే ఉజ్వల భవిష్యత్

Wed,May 22, 2019 03:03 AM

-ప్రణాళికతో ముందుకెళ్తే విజయమే
-కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
-పది జీపీఏ సాధించిన విద్యార్థులకు అభినందనలు

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: విద్యార్థులకు చదువుతోను ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో పది జీపీఏ సాధించిన విద్యార్థులను మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తన కార్యాలయంలో అభినందించారు. దీంతో ఉత్తమంగా విద్యను అందించిన ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పక్క ప్రణాళికతో చదివుతే అనుకున్న స్థాయికి చేరుకోవచ్చన్నారు. చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలల్లో చదువుతో పాటు సంస్కారాన్ని అలవరచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభావంతుడికి అభినందనలు
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన పాల్ నిఖిల్‌ను జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సన్మానపత్రంతో పాటు జ్ఞాపికను అందజేసి అభినందించారు. అలాగే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చే స్తున్న సిర్పూర్(టి) ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులను అభినంధించారు. అనంత రం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డీఈవో భిక్షపతి విద్యార్థి నిఖిల్‌ను అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయు డు సయ్యద్ మజర్‌హుస్సేన్, ఉపాధ్యాయులు దేవాజీ, అంబరావు, విద్యార్ధి తల్లిదండ్రులు చరణదాస్, జంగుబాయి, తదితరులు పాల్గొన్నారు.

పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించినందుకు కస్తూర్బా పాఠశాల ప్రత్యేకాధికారి రమాదేవికి మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికఅందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాలకు మంచి గుర్తింపు లభించిందన్నారు. రానున్న రోజుల్లో మరింత బాధ్యతతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సిర్పూర్(యు): మండల విద్యాశాఖాధికారి కుడ్మెత సుధాకర్‌కు జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపిక మంగళవారం అందజేశారు. మండలంలోని కస్తూర్బా గాంధీ, కోహినూర్, మహగాం ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత రావడంతో కలెక్టర్ ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారని మండల విద్యాశాఖాధికారి సుధాకర్ తెలిపారు.

బెజ్జూర్ : మండలంలోని సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడిచిన విద్యా సంవత్సరంలో పదో తరగి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేశ్ బాబు మంగళవారం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకున్నారు. పాఠశాలలో 57 మంది విద్యార్థులు పదో తరగతి చదువుగా అందరు ఉత్తీర్ణులకావడంతో ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles