నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

Mon,May 20, 2019 11:08 PM

బెజ్జూర్‌ : నకిలీ విత్తనాలు, అనుమతి లేని గడ్డి మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని ఏఓ రాజుల నాయుడు హెచ్చరించారు. సోమవా రం ఎస్‌ఐ శంకర్‌ రావుతో కలిసి మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్‌ షా పులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, అనుమతి లేని కలుపు, గడ్డి మందులు సాగు చేసిన రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవన్నారు. దుకాణాల్లో కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు తప్పని సరి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆమోదం పొందిన విత్తనాలు, అనుమతించిన కలు పు మందులను మాత్రమే వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు పా టుపడాలని ఆయన కోరారు.
కౌటాల : మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలుచ గోదాంలను పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువులు, పత్తి, ఇతర విత్తనాలు, స్టాక్‌ రిజిష్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామనీ, అంతేగాకుండా దుకాణాలు సీజ్‌ చేసి, లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. ైగ్లెసిల్‌ పత్తి విత్తనాలు ఎవరైనా అమ్మితే వెంటనే పోలీసులు, వ్యవసాయ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. తనిఖీల్ల్లో ఎస్‌ఐ ఆంజనేయులు, మండల వ్యవసాయాధికారి పాలకుర్తి రాజేశ్‌లున్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles