విధుల్లో జాగ్రత్తగా ఉండాలి

Mon,May 20, 2019 11:08 PM

కాగజ్‌నగర్‌ రూరల్‌ : ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు విధుల్లో కౌంటింగ్‌ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఎంపీడీవో సుశీల్‌ రెడ్డి, మాస్టర్‌ ట్రైనర్‌ శ్రీధర్‌ సుమన్‌ సూచించారు. ఈ నెల 27న నిర్వహించనున్న ప్రాదేశిక ఓట్ల లెక్కింపుపై కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం కౌంటింగ్‌ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో 15 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. కౌంటింగ్‌కు వచ్చే ఏజెంట్లు, పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత దరఖాస్తు ఫారాలు నింపి, ముందుగానే ఆర్వోలకు అందజేయాలని సూచించారు. అనంతరం లెక్కింపుపై అవగాహన కల్పించారు. లెక్కింపు సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించాలనీ, ఎంపీటీసీ గులాబీ రంగు బ్యాలెట్‌ పేపర్లను, జడ్పీటీసీ తెలుపురంగు బ్యాలేట్‌ పేపర్లను వేరు చేసిన అనంతరం పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓట్లు లెక్కించాలని సూచించారు. మొదటగా ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపర్లను లెక్కించి, ఫలితాలు ప్రకటించాలని అన్నారు. ఆ తర్వాత జడ్పీటీసీ బ్యాలెట్‌ పేపర్లను లెక్కించాలని పేర్కొన్నారు. లెక్కింపు కేంద్రంలోకి గుర్తింపు కార్డు ఉన్న వారినే అనుమతించాలని ఆదేశించారు. ఈ లెక్కింపు ప్రక్రియ సిర్పూర్‌ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో ప్రతి మండలానికీ వేరువేరుగా లెక్కింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 500 మంది ఎన్నికల కౌంటింగ్‌ సిబ్బంది, శిక్షకులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles