ఆ చేపలు మావే.. కాదు మావే..

Mon,May 20, 2019 11:07 PM

పెంచికల్‌పేట్‌: పెంచికల్‌పేట్‌ మండలం దరొగపల్లి చెరువు వద్ద సోమవారం చేడ్వాయి గంగపుత్రు లు, మం చిర్యాల జిల్లా భీమిని మండలం తెనుగుపల్లెకు చెందిన మత్స్యకార సంఘం సొసైటీ అధ్యక్షుడు భీమయ్యకు వా గ్వాదం జరిగింది. దరొగపల్లి చెరువులో ప్రభుత్వం చేపపిల్లలను పెంచుతుంది. చేపల పెంపకంపై తమకంటే తమకే హక్కులు ఉన్నాయంటూ ఏడాదిగా ఇరువర్గాల మధ్య గొడవ లు జరుగుతున్నట్లు ఎస్‌ఐ రమేశ్‌ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున గంగపుత్రులు చేపలు ప డుతుండగా.. భీమయ్యతో పాటు దరొగపల్లికి చెంది న మన్నెకులస్థులు వచ్చి మాకే హక్కు ఉందంటూ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. బోయిరె సత్తయ్య తల పగిలిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యా యి. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపుచేశారు. గంగపుత్రులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని జిల్లా మత్స్యశాఖ అధికారితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles