నిషేధిత విత్తనాలు అమ్మితే చర్యలు

Mon,May 20, 2019 11:07 PM

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : నిషేధిత పత్తి విత్తనాలు, పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి ఫెర్టిలైజర్స్‌ డీలర్లను హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పలు ఫెరిలైజర్‌ దుకాణాలలో సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. నిల్వ ఉంచిన స్టాక్‌ను తనిఖీ చేశారు. అనంతరం అధికారిణి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. డీలర్లు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ బీటీ పత్తి విత్తనాలను ఎవరు అమ్మినా, తరలించినా, నిల్వ ఉంచినా పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలను అమ్మేందుకు ప్రయత్నించే వారి వివరాలను సంబంధిత మండలాల తాసిల్దార్లు, ఏఓలకు, ఎస్‌ఐలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. డీలర్లు కాలపరిమితి ముగిసిన పురుగు మందులను దుకాణాల్లో ఉంచవద్దనీ, అమ్మవద్దని సూచించారు. తనిఖీల్లో సీఐ మల్లయ్య, ఏవో ఖాధర్‌హూస్సేన్‌, ఎస్‌ఐ వెంకటేశ్‌, తదితరులు ఉన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles