పెర్సాపేన్ సంబురం

Mon,May 20, 2019 04:08 AM

-హట్టిలో అడవిబిడ్డల ప్రత్యేక పూజలు
-ఆకట్టుకున్న మహిళల నృత్యాలు
కెరమెరి: మండలంలోని హట్టి గ్రామంలో మెసెల్కర్ మడవి వంశీయులు ఆదివారం పెర్సాపేన్ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఇంటిదేవతగా కొలిచే పెర్సాపేన్ వద్ద పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సంప్రదా య వాయిద్యాలపై మహిళలు నృత్యాలు చేశారు. శుక్రవారం ప్రారంభమైన ఈ వేడుకలు సోమవారం ముగిస్తాయని కటోడ మడవి లక్ష్మణ్, పటే ల్ మడవి దంబీ, కమిటీ అధ్యక్షుడు మడవి రఘునాథ్, ప్రధాన కార్యదర్శి మడవి జంగు తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాలు నేటికి గ్రామాల్లో కొనసాగుతున్నాయి. పెర్సాపేన్ అంటే పెద్దదేవుడు. ఆదివాసుల్లోని ప్రతి వంశీయులకు ఓ పెర్సాపేన్ ఉంటుంది. ఏ వంశంలోనైన కొత్తకోడ ళ్లు సంప్రదాయంగా భేటింగ్ అయిన తరువాతనే పెర్సాపేన్‌ను దర్శించడానికి అర్హులు. ఒకసారి భేటింగ్ చేస్తే మరోసారి తుమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. తుమ్ అంటే చనిపోయిన వారి పేరిట జ రుపుకునే కర్మకండం, ఇలా ప్రతి కార్యక్రమం నిర్వహిస్తూ ఆదివాసీలు తమ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు.
ఇంద్రవెల్లి: మండలంలోని వాల్గోండ గ్రామ పంచాయతీ పరిధిలోని పోల్లుగూడ గ్రామంలో జుగ్నక్ వంశీయుల ఆధ్వర్యంలో పెర్సాపేన్ (పెద్ద దేవుడు)కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆదివారం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన జుగ్నక్ వంశీయులు పోల్లుగూడకు తరలివచ్చి సంప్రదాయ ప్రకారం గ్రామ పోలిమేరలోని ఓట్టు వద్ద ఉన్న పెర్సాపేన్‌ను ఉరేగించారు. అనంతరం అదే చెట్టువద్ద ఏర్పాటు చేసి మహిళలు, పురుషులు వేర్వేరుగా పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. జుగ్నక్ వంశీయుల్లోని 50మంది కొత్తకోడళ్లు భేటింగ్(పరిచయ వేదిక) నిర్వహించి పెర్సాపేన్‌కు పూజలు నిర్వహించే అవకాశాన్ని కల్పించారు. అనంతరం కొత్తకోడళ్లను పెద్దలతో పరిచయం చేసి వారి ద్వారా ఆశీర్వాదం తీసుకున్నారు. సంప్రదాయ వాయిద్యాలపై ఆదివాసీ గిరిజనులు నృత్యాలు చేసి ఆడిపాడారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles