విభజనకు వేళాయె!

Sun,May 19, 2019 12:50 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లా పరిషత్ విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు 20 అంశాలతో కూడిన మార్గదర్శకాలు వెలువడగా, యంత్రాంగం అందుకు సంబంధించిన పనుల్లో నిమగ్నమైంది. ఆసిఫాబాద్ మండల పరిషత్ కార్యాలయ భవనంలో జడ్పీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుండగా, అధికారులు, సిబ్బంది విభజనకూ ఏర్పాట్లు చేస్తున్నది. ఆర్డర్ టూ సర్వ్ పద్ధతిన నియమించే అవకాశముండగా, ఇటు కొత్త పాలకవర్గం కూడా జూలై 5 లోగా కొలువుదీరనున్నది. ఇక జైనూర్ జడ్పీటీసీగా కోవలక్ష్మి ఏకగ్రీవం కాగా, జడ్పీ చైర్‌పర్సన్‌గా ఆమె ఎన్నికకు దాదాపు మార్గం సుగమైంది.

జిల్లాల పునర్విభజన లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌లను మూడు జిల్లాలుగా విభజించారు. ఆసిఫాబాద్ నియోజవర్గంలో ని నార్నూర్ మండలంతో పాటు నూతనంగా ఏర్పా టు చేసిన గాదిగూడ మండలాన్ని ఆదిలాబాద్ జిల్లా లో వీలినం చేశారు. మార్పులు చేర్పుల తర్వాత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. 2016 అక్టోబర్ 11 నుంచి జిల్లా పరిషత్‌ను ఉమ్మడిగా కొనసాగించారు. అన్ని శాఖల్లో విభజనలు జరిగిప్పటికీ.. జడ్పీ మాత్రం మిగిలిపోయిం ది. కొత్తగా ఆవిర్భంవించిన జిల్లాలకు అనుగుణంగా జడ్పీలు ఏర్పాటు చేయడానికి పంచాయితీరాజ్ శా ఖ రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహాలు చేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో 3 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ వంటి పదవులతో పాటు పెగిరిన మండలాల వారీగా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు పెరగనున్నాయి.

20 అంశాలపై మార్గదర్శకాలు
జిలా పరిషత్ విభజనకు పంచాయతీరాజ్ శాఖ నుంచి 20 అంశాలతో కూడిన మార్గదర్శకాలు వెలువడ్డాయి. దీనిపై జిల్లా పరిషత్ అధికారులు లెక్కలు తేల్చుతున్నారు. ప్రస్తుత జిల్లా పరిషత్ నోడల్ జడ్పీగా కొనసాగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న ఫర్నిచర్,సిబ్బంది, వివరాలు,కంప్యూటర్లు,ఫ్యాన్లు, జిరాక్స్ మిషన్లు, అ ల్మారాలు ఇలా 20 అంశాలతో కూడిన మార్గదర్శకాలు జిల్లా పరిషత్‌కు అందాయి. జిల్లా పరిషత్ ప్రస్తుత పాలకవర్గం 2014, జూలై 5న ఏర్పడింది. తాజాగా, 2019 జూలై 5 లోపు కొత్త పాలక వ ర్గాలు ఏర్పాటు కానున్నాయి. అందులో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ నెల 6,10,14 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. 2016లో ఉమ్మడి జిల్లాను విభజించి కుమ్రం భీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలను ఏర్పాటు చేశారు.

కొనసాగుతున్న జడ్పీ భవనాల ఎంపిక ప్రక్రియ
జిల్లా పరిషత్ ఏర్పాటు కోసం భవనాలను గుర్తిస్తున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ నుంచి స్ప ష్టమైన మార్గదర్శకాలు వచ్చాయి. దానికి అనుగుణంగా ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను అన్వేషిస్తున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయానికి అనువుగా ఉన్నటు వంటి భవనం కోసం అధికారులు చూస్తున్నారు. ఆసిఫాబాద్ మండల పరిషత్ కార్యాలయ భవనంలో జ డ్పీ కార్యాలయన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. లేదంటే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని జిల్లా పరిషత్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 14న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. 27న ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే పరిషత్ ఏర్పాటు వేగవంతం కానున్నది.

ఉద్యోగుల విభజన ఇలా..
ప్రస్తుత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు జిలా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలు కలిపి, బోధనేతర సిబ్బంది ఉండగా, వీరిని పంచాయతీరాజ్ ఉద్యోగులుగా పరిగణిస్తారు. గ్రామీణ నీటిపారుదల, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లోను పనిచేసే సిబ్బంది ఉంటారు. జి ల్లా పరిషత్ కార్యాలయంలో విద్యా విభాగం, జీపీఎఫ్, అకౌంట్స్, బీఆర్‌జీఎఫ్, ప్లానింగ్ ఐదు విభాగాలు ఉంటాయి. ఈ కార్యాలయాల్లో ఐదుగురు సూపరింటెండెంటు,్ల 14 మంది సీనియర్ అసిస్టెం ట్లు,14 మంది జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్ట్‌లు, అంటెండర్లు ఇతర సిబ్బంది కలిపి 60 మంది వర కు ఉన్నారు. వీరితో పాటు 44 మంది ఎంపీడీవో లు, 120 మంది సీనియర్ అసిసెంట్లు,115 మంది జూనియర్ అసిసెంట్లు, 3440 జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో 7 వేల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్ ఖాతాలు, 340 మంది నాలుగో తరగతి ఉద్యోగులు ఉమ్మడి జిల్లా పరిషత్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిని జిల్లాల వారీగా విభజించనున్నారు.

డిప్యూటేషన్ లేదా ఆర్డర్ సర్వ్ పద్ధతిలో..
జిల్లా పరిషత్‌కు ఉద్యోగులు తక్కువగా ఉండడంతో నూతనంగా రిక్రూట్‌మెంట్ చేసే వరకు మండల పరిషత్‌లోని అదనపు ఉద్యోగులను జిల్లా పరిషత్‌కు డిప్యూటేషన్ ద్వారా లేదా ఆర్డర్ టూ సర్వ్ పద్ధతిలో నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక మండల పరిషత్‌లో ఎంపీడీవో, ఈవోఆర్డీ, ఏఈపీఆర్, ఎంఈవో, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, యూడీసీ, టైపిస్ట్, అటెండర్లను మండల పరిషత్ నుంచి డిప్యూటేషన్ లేదా ఆర్డర్ టూ సర్వ్ పద్ధతిలో నియమించేందుకు ప్రభుత్వం చూస్తుంది.

జడ్పీ చైర్‌పర్సన్‌గా కోవ లక్ష్మి ఎన్నికకు మార్గం సుగమం..
తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలతో పాటు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలనను తీసుకువచ్చింది. అంతేగాకుండా ప్రతి జిల్లాకు జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఇటీవల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మిని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. జైనూర్ జడ్పీటీసీగా కోవలక్ష్మి ఏకగ్రీవం కావడంతో జైడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమైనట్లు అయ్యింది. జిల్లా వ్యాప్తంగా మిగితా 14 జడ్పీటీసీలలో అత్యధిక స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. దీంతో జడ్పీ అధ్యక్షురాలిగా కోవ లక్ష్మి ఎన్నిక సులభంకానున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మొదటిసారి ఏర్పాటయ్యే జడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగరే అవకాశముంది.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles