ఘనంగా బుద్ధ జయంతి

Sun,May 19, 2019 12:49 AM

వాంకిడి: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో దళిత నాయకులు శనివారం బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఆ సంఘం నాయకులు దు ర్గం దుర్గాజీ పంచాశీల్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్ర త్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఉప్రే జైరాం, పాండు, దుర్గం శ్యాంరావు, విలాస్, అశో క్, మహిళలు గంగుబాయి, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్: నార్నూర్, గాదిగూడ మండలాల్లోని దళితవాడల్లో శనివారం బౌద్ధమతస్తుల ఆధ్వర్యంలో బుద్ధపౌర్ణిమను ఘనంగా నిర్వహించారు. గౌతమబుద్ధుడి చిత్రపటం, ప్రతిమ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండల కేంద్రంలోని త్రిర్ణత బుద్ధవిహార్‌లో విద్యావేత్త బాలాజీ కాంబ్లే మాట్లాడుతూ, శాంతి, సహనం, సంఘజీవితం, సమసమాజస్థాపన అంశాలుగా బుద్ధుని బోధనలు సాగుతాయని చెప్పారు. బుద్ధుని శాంతి సందేశం ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. బుద్ధుడు చూపిన సన్మామార్గాన్ని అనుసరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ హేమలత బ్రిజ్జిలాల్, దుర్గే కేశవ్, చంద్రశేఖర్, శాంతరావ్, సునీల్, రాజేందర్, రుక్మాబాయి, మీనాబాయి, లక్ష్మి, చంద్రకళబాయి, సేవంతబాయి, యశోదబాయి పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles