మొక్కలు రైతులకు అందించాలి

Sun,May 19, 2019 12:48 AM

రెబ్బెన: తెలంగాణకు హరితహరంలో అన్ని మొక్కలు రైతులకు అందించాలని ఈజీఎస్ ప్రత్యేకాధికారి పీ కిషన్ సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని శనివారం ఆయన సందర్శించారు. మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో మంచి మొక్కలు పెంచాలనీ, మొక్కల సంరక్షణకు పెంపకానికి ఈజీఎస్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకొవాలని సూచించారు. నర్సరీలో ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం పెంచుతున్న ప్రైమరీ బెడ్‌లను చూసి సంతోషం వ్యక్తం చేశారు. జీవామృతం, కేడన్‌స్లరి సందర్శించి అభినందించారు. ఆయన వెంట రెబ్బెన డిప్యూటీ రేంజ్ అధికారి కారం శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles