పెర్సాపేన్‌కు గంగస్నానం

Sun,May 19, 2019 12:48 AM

సిర్పూర్(యు): మండల కేంద్రంలోని ప్రసిడెంట్‌గూడలో సిర్పూర్‌కర్ ఆత్రం వంశీయుల పెర్సాపేన్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం జైనూర్ మండలంలోని గంగనది కాలువలో పెర్సాపేన్‌కు స్నానం చేయించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రసిడెంట్ గూడలో మహాపూజ నిర్వహించారు. కార్యక్రమంలో కట్టోడ, గ్రామపెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తిర్యాణి: మండలంలోని గడలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పావనమడుగు వద్ద శనివారం ఆదివాసులు ప్రతేక పూజలు నిర్వహించారు. సిడాం, నైతం, ఆత్రం, వెడ్మ, మడావి, కనక, వంశస్థులు తమ పెద్ద దేవుడైన పెర్సాపేన్‌ను పావనమడుగుకి తీసుకువచ్చి గంగ స్నానం చేయించి పూజలు నిర్వహించారు. నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అంబలి, బెల్లం పానకాన్ని భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘం జాతీయ నాయకుడు సిడాం అర్జు, జడ్పీటీసీ వెడ్మ కమల, గడలపల్లి, ఖైరిగూడ, గిన్నేదరి, ఎదులపాడ్, చింతపల్లి, కన్నేపల్లి, చోపిడి గ్రామాల సర్పంచులు మడావి గుణవంతరావు, కుర్సెంగ బాదిరావు, మడావి గోపాల్, ఆత్రం రుక్మిణి, వెడమ మమత, మర్సుకోల వినోద్‌కుమార్, గిరిజన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు కుర్సెం మోతిరాం, ప్రవీణ్‌కుమార్, దస్రు, వెడ్మ యశ్వంత్‌రావు, తుడుందెబ్బ మండలాధ్యక్షుడు భగవంతరావు, నైతం భీంరావు ఆదివాసులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles